Ganguly on Ranji Trophy: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ముందు పలువురు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ టోర్నీ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఇదే విషయమై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. టోర్నీ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా షెడ్యూల్ ప్రకారమే టోర్నీ నిర్వహిస్తామని వెల్లడించారు.
రంజీ ట్రోఫీ నిర్వహణపై గంగూలీ క్లారిటీ - గంగూలీ రంజీ ట్రోఫీ
Ganguly on Ranji Trophy: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

Sourav Ganguly
ఈ ఏడాది రంజీ ట్రోఫీ ఈ నెల 13న ప్రారంభమై మార్చి 20 వరకూ జరగనుంది. గ్రూప్ దశలోని తటస్థ మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లకు కోల్‌కతా వేదిక కానుంది.
సోమవారం బంగాల్‌తో పాటు ముంబయి క్రికెట్ జట్టులో పలువురికి కరోనా సోకింది. యువ క్రికెటర్ శివం దూబెకు కూడా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో ఈ టోర్నీ నిర్వహణపై పలు అనుమానాలు రేకెత్తాయి.