BCCI Central Contract: బీసీసీఐ త్వరలోనే ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ విషయమై చర్చలు జరిపి మార్పులు చేసే అవకాశముందని తెలిసింది. ప్రస్తుతం గ్రూప్-ఏలో.. టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న కేఎల్ రాహుల్, పంత్‌కు ప్రమోషన్ లభించొచ్చని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వారిని కోహ్లీ, రోహిత్, బుమ్రా కొనసాగుతున్న 'ఏ ప్లస్' కేటగిరిలోకి మార్చవచ్చని అన్నారు.
గత కొంతకాలంగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాటర్స్ రహానె, పుజారాను 'ఏ' కేటగిరిలోనే ఉంచాలా? లేదా? అన్న విషయంపై కూడా చర్చ జరగవచ్చని పేర్కొన్నారు.
మెరుగైన ప్రదర్శన చేయలేక సతమతమవుతున్న హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మను గ్రూప్ ఏ నుంచి బీకి మార్చొచ్చని కూడా తెలిసింది. ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న శార్దూల్ ఠాకూర్‌ను గ్రూప్ బీ నుంచి ఏకు.. గ్రూప్ సీలో ఉన్న సిరాజ్, శుభమన్ గిల్, హనుమ విహారికి కూడా ప్రమోషన్ లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కవచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.