క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(7 days for WTC Final) మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సౌథాంప్టన్ మైదానంలో టీమ్ఇండియా క్రికెటర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగే తుదిపోరులో టీమ్ఇండియా క్రికెటర్లకు తమ అభిమానులు మద్దతుగా నిలవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ట్విట్టర్లో ఫ్యాన్స్‌ను కోరింది.
"ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు మరో వారం రోజుల సమయమే ఉంది. తుదిపోరులో న్యూజిలాండ్‌తో తలపడడానికి టీమ్ఇండియాకు అభిమానుల మద్దతు అవసరం" అని బీసీసీఐ ట్వీట్ చేసింది.