తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా కొత్త స్పాన్సర్​ వచ్చేసింది - టీమ్​ఇండియా కొత్త స్పాన్సర్​ డ్రీమ్​ 11

Team india new sponsor : టీమ్‌ఇండియాకు కొత్త స్పాన్సర్​ను ప్రకటించింది బీసీసీఐ. ఇంతకీ ఎవరంటే?

Teamindia Sponsor
టీమ్​ఇండియా కొత్త స్పాన్సర్​ను ప్రకటించిన బీసీసీఐ

By

Published : Jul 1, 2023, 2:23 PM IST

Updated : Jul 1, 2023, 2:51 PM IST

Team india new sponsor : టీమ్‌ఇండియాకు కొత్త స్పాన్సర్‌ వచ్చింది. ఫాంటసీ స్పోర్ట్స్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ 'డ్రీమ్‌ 11' మరోసారి స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమైంది. జెర్సీ మీద ఇక నుంచి డ్రీమ్‌ 11 లోగోతో టీమ్​ఇండియా ప్లేయర్స్​ బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు స్పాన్సర్‌గా బైజూస్‌ ఉండగా.. ఇప్పుడు మూడేళ్ల కాలానికి డ్రీమ్‌ 11కి స్పాన్సరింగ్‌ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వెస్టిండీస్‌ పర్యటన నుంచి డ్రీమ్‌ 11 స్పాన్సర్‌షిప్‌ మొదలుకానుంది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, డ్రీమ్‌ స్పోర్ట్స్‌ సహ యజమాని, సీఈవో హర్ష్‌ జైన్‌ తాజా వివరాలు తెలిపారు.

Dream 11 Team India : "ఇకపై బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11 వ్యవహరించనుంది. ఇది మరింత బలోపేతం అవ్వాలని అనుకుంటున్నాం. భారత క్రికెట్​పై నమ్మకం ఉండటం వల్లే మరోసారి స్పాన్సర్‌గా ఉండేందుకు డ్రీమ్‌ 11 ముందుకొచ్చింది. ఇకపోతే ఈ ఏడాదిలోనే ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. బీసీసీఐ - డ్రీమ్‌ 11 భాగస్వామ్యం తప్పకుండా అభిమానులకు మరింత చేరువుతుందని ఆశిస్తున్నాను" అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ అన్నారు.

"చాలాకాలం పాటు భారత క్రికెట్ జట్టు, బీసీసీఐతో భాగస్వామిగా ఉన్నాం. మళ్లీ స్పాన్సర్‌గా రావడం అనేది థ్రిల్లింగ్‌గా ఉంది. కోట్లాది భారత క్రికెట్ అభిమానులకు మా ప్రేమను పంచుతాం. జాతీయ క్రికెట్‌ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించడం గర్వకారణంగా ఉంది. భారత క్రీడారంగానికి ఎల్లవేళలా మేము మద్దతుగా ఉంటాం" అని డ్రీమ్‌ స్పోర్ట్స్‌ సీఈవో హర్ష్‌ జైన్‌ వెల్లడించారు. గతంలో ఐపీఎల్‌ 2020 సీజన్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11 వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించడం గమనార్హం.

కిట్​ స్పాన్సర్​ కూడా మామూలుగా లేదుగా..
Team Indi Adidas టీమ్ఇండియా కిట్ స్పాన్సర్‌ ఆడిదాస్ ఇటీవలే బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుని ప్లేయర్ల కోసం కొత్త జెర్సీలను విడుదల చేసింది. వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ప్రారంభ నేపథ్యంలో ముంబయిలోని వాంఖడే స్డేడియం వేదికగా భారత క్రికెట్​ జట్టుకు సంబంధించిన మూడు ఫార్మాట్ల జెర్సీలను ఆవిష్కరించింది. ఈ విషయాన్ని ఆడిదాస్​ తమ అధికార ఇన్‌స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. ఒక ఐకానిక్ క్షణం. ఒక ఐకానిక్ స్టేడియం. కొత్త టీమ్ ఇండియా జెర్సీలను పరిచయం చేస్తున్నాము అనే క్యాప్షన్​ను సైతం జోడించింది. ఇక ఈ జెర్సీలను ధరించి టీమ్ ఇండియా ప్లేయర్స్​ ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఇదీ చూడండి :

వరల్డ్​ కప్​ హీరోకు అరుధైన వ్యాధి.. ఇకపై సెంచరీ కొట్టలేనంటూ ఎమోషనల్​..

'ప్లేయర్స్​పై వర్క్​లోడ్​ తగ్గించడమా? అది సాధ్యమయ్యే పని కాదు'

Last Updated : Jul 1, 2023, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details