తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు టీమ్​లోకి రహానె.. WTC ఫైనల్​కు భారత జట్టు ఇదే.. కీపర్​గా తెలుగుబిడ్డ - wtc 2023 india australia

వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ 2023 ఫైనల్ మ్యాచ్​కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజింక్య రహానె తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్​ కమిటీ ప్యానెల్​, సెక్రటరీ జై షా తోపాటు కెప్టెన్​ రోహిత్​ శర్మ, రాహుల్​ ద్రవిడ్​లతో సమావేశమై సోమవారం తుది జట్టును నిర్ణయించారు.

bcci-announces-team-india-squad
bcci-announces-team-india-squad

By

Published : Apr 25, 2023, 11:37 AM IST

Updated : Apr 25, 2023, 1:12 PM IST

జూన్​ నెలలో జరగబోయే వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ 2023 ఫైనల్స్​కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. తాజా ఐపీఎల్​లో దుమ్ములేపుతున్న అజింక్య రహానే వైపు సెలెక్షన్​ కమిటీ మొగ్గు చూపింది. మిస్టర్​ 360గా పేరున్న సూర్యకుమార్​ యాదవ్​కు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటికే ఫైనల్​ చేరిన భారత్​ ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఓవల్​ వేదికగా జూన్​ 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరగనుంది.

శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని కారణంగా రహానేకు పిలుపు అందింది. ప్రస్తుతం అయ్యర్​ యూకేలో చికిత్స పొందుతున్నాడు. రహానే టీమ్​ఇండియాలో 15 నెలల తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. ఫైనల్​లో అయ్యర్​ స్థానంలో రహానే ఆడనున్నాడు.

రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు సారథ్యం వహించిన 34 ఏళ్ల రహానే 700 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్​లో చెన్నై తరఫున ఆడుతున్న అతడు ఏకంగా 200 స్ట్రయిక్​ రేట్​తో విజృంభిస్తున్నాడు. సేనా ( సౌతాఫ్రికా, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఆడిన అనుభవం, టెస్ట్​ మ్యాచ్​ల్లో నిలకడగా రాణించడం.. ఇవన్నీ రహానెను మళ్లీ జట్టులోకి తీసుకొచ్చాయనే చెప్పవచ్చు. టెస్ట్​ల్లో రహానె 140 ఇన్నింగ్స్​ల్లో 38.52 సగటుతో 4931 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 25 అర్ధ శతకాలు ఉన్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌గా మాత్రమే కాకుండా కీపర్‌గా వినియోగించుకుని.. రహానెను అదనపు బ్యాటర్‌గా మిడిలార్డర్​లో ఆడించడానికి అవకాశం ఉంది. కాగా భారత్​ తరఫున రహానె 2022 జనవరిలో కేప్​టౌన్​లో సౌత్​ఆఫ్రికాతో జరిగిన సిరీస్​లో చివరిసారిగా ఆడాడు.

ఫైనల్​లో తెలుగు తేజం భరత్...
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్​లో భాగంగా జట్టులో ఉన్న కుల్దీప్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్​లకు ఉద్వాసన పలికిన సెలక్టర్లు... తెలుగు కుర్రాడు కేఎస్​ భరత్​కు వికెట్​ కీపర్​గా అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్​కు 12వ తేదీని రిజర్వ్​ డేగా ప్రకటించారు. ఒకవేళ మ్యాచ్​ జరిగే రోజుల్లో ఒక పూర్తి డే మొత్తం అంతరాయం ఏర్పడితే అదనంగా రిజర్వడే రోజు ఆడతారు.

వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ 2023 ఫైనల్ మ్యాచ్

రోహిత్​ సారథ్యంలోని టీమ్ఇండియా జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.

ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్​ కమిన్స్​(కెప్టెన్‌), స్కాట్​ బోలాండ్​, అలెక్స్​ కేరీ, కామెరూన్​ గ్రీన్​, మార్కస్​ హరీస్​, జోష్​ హేజిల్​వుడ్​, ట్రావిస్​ హెడ్​, జోష్​ ఇంగ్లీస్​, ఉస్మాన్​ ఖవాజా, లబుషేన్​, నేథన్​ లియాన్​, మిచెల్​ మార్ష్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ రెన్​షా, స్టీవ్​ స్మిత్​, మిచెల్​ స్టార్క్​, డేవిడ్​ వార్నర్​.

Last Updated : Apr 25, 2023, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details