తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా షెడ్యూల్‌: లంక, కివీస్​, ఆసీస్​తో సిరీస్‌ వివరాలు ఇవే

BCCI announces schedule   against Sri Lanka New Zealand  Australia
టీమ్​ఇండియా షెడ్యూల్‌: లంక, కివీస్​, ఆసీస్​తో సిరీస్‌ వివరాలు ఇవే

By

Published : Dec 8, 2022, 12:52 PM IST

Updated : Dec 8, 2022, 2:18 PM IST

12:48 December 08

టీమ్​ఇండియా షెడ్యూల్‌

టీమ్‌ఇండియా కొత్త ఏడాది వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడపనుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంలో సిరీస్‌లను ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. అయితే వీటిలో రెండు వన్డేలకు తెలుగు రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. న్యూజిలాండ్‌తో (జనవరి 18) హైదరాబాద్‌ వేదికగా, ఆస్ట్రేలియాతో (మార్చి 19) వైజాగ్‌ వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో నాలుగు టెస్టులు, 9 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లను భారత్‌ ఆడనుంది. ఆ సిరీస్‌ల వివరాలు ఇలా..

శ్రీలంకతో సిరీస్‌: శ్రీలంకతో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలను ఆడనుంది. జనవరి 3 నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత్‌లో శ్రీలంక పర్యటించనుంది. ఆయా మ్యాచ్‌ల సమయాలను వెల్లడించాల్సి ఉంది.

మొదటి టీ20: జనవరి 3, ముంబయి

రెండో టీ20: జనవరి 5, పుణె

మూడో టీ20: జనవరి 7, రాజ్‌కోట్

వన్డేలు..

తొలి వన్డే : జనవరి 10, గువాహటి

రెండో వన్డే: జనవరి 12, కోల్‌కతా

మూడో వన్డే: జనవరి 15, త్రివేండ్రం

న్యూజిలాండ్​తో సిరీస్‌: కివీస్‌తో టీమ్‌ఇండియా తొలుత మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20లను ఆడనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌ ముగియగానే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కివీస్‌తో సిరీస్‌ ప్రారంభం కానుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌ ఇక్కడ పర్యటించనుంది.

తొలి వన్డే మ్యాచ్‌: జనవరి 18, హైదరాబాద్‌

రెండో వన్డే మ్యాచ్: జనవరి 21, రాయ్‌పుర్

మూడో వన్డే మ్యాచ్: జనవరి 24, ఇందౌర్‌

టీ20లు..

మొదటి టీ20: జనవరి 27, రాంచీ

రెండో టీ20: జనవరి 29, లక్‌నవూ

మూడో టీ20: ఫిబ్రవరి 1, అహ్మదాబాద్‌

ఆస్ట్రేలియాతో సిరీస్‌: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టులు, అనంతరం మూడు వన్డేలు ఆడతాయి. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు దాదాపు నెలన్నర రోజులు భారత్‌లో ఆసీస్‌ పర్యటన ఉంటుంది.

తొలి టెస్టు మ్యాచ్‌: ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, నాగ్‌పుర్

రెండో టెస్టు మ్యాచ్‌: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, దిల్లీ

మూడో టెస్టు మ్యాచ్‌: మార్చి 1 నుంచి 5 వరకు, ధర్మశాల

నాలుగో టెస్టు మ్యాచ్‌: మార్చి 9 నుంచి మార్చి 13 వరకు, అహ్మదాబాద్‌

వన్డేలు

మొదటి వన్డే: మార్చి 17, ముంబయి

రెండో వన్డే: మార్చి 19, విశాఖపట్నం

మూడో వన్డే: మార్చి 22, చెన్నై

ఇదీ చూడండి:బంగ్లాతో టెస్ట్ సిరీస్​.. హిట్​ మ్యాన్​ స్థానంలో ఆ సెంచరీల వీరుడు!

Last Updated : Dec 8, 2022, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details