Team India Squad For WI : జులైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీ20 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు తొలిసారిగా అంతర్జాతీయ జట్టులో చోటు దక్కింది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు..
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యశ్వసీ జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
వన్డే జట్టు..రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
టెస్టు జట్టు..రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైశ్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
India Tour Of West Indies 2023 : కాగా వచ్చే నెలలో భారత్.. విండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి మొదటి టెస్టు ప్రారంభంకానుంది. కాగా డబ్ల్యూటీసీ 2023-25 టోర్నీలో టీమ్ఇండియా ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే.
విండీస్ పర్యటన వివరాలు..
- తొలి టెస్ట్- జులై 12-16, విండ్సర్ పార్క్, డొమినికా
- రెండో టెస్ట్- జులై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్
- జులై 27- తొలి వన్డే, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
- జులై 29- రెండో వన్డే, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
- ఆగస్ట్ 1- మూడో వన్డే, బ్రెయిన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
- ఆగస్ట్ 3- తొలి టీ20, బ్రెయిన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
- ఆగస్ట్ 6- రెండో టీ20, నేషనల్ స్డేడియం, గయానా
- ఆగస్ట్ 8- మూడో టీ20, నేషనల్ స్డేడియం, గయానా
- ఆగస్ట్ 12- నాలుగో టీ20, బ్రౌవార్డ్ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
- ఆగస్ట్ 13- ఐదో టీ20, బ్రౌవార్డ్ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా