బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ప్రకటన.. ఛైర్మన్ ఎవరంటే? - పురుషుల జట్టు కొత్త సెలక్షన్ కమిటీ
16:44 January 07
మరోసారి ఛైర్మన్‌గా చేతన్ శర్మ
భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మరోసారి చేతన్ శర్మ నియామకమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చేతన్‌తో పాటు ఈ సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌ను నియమించినట్లు వెల్లడించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆ పదవుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది బోర్డు. నవంబరు 18న ఐదు పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 600 మంది అప్లై చేశారు. వీరిలో 11 మందిని షార్ట్‌లిస్ట్ చేసి చివరగా తమకు కావాల్సిన ఐదుగురిని ఎంపిక చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉంటాడని ప్రకటించింది.
ఇదీ చూడండి:పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ!