మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాట ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఓపెనింగ్ సీజన్లో పాల్గొననున్న ఐదు జట్లు రూ.4,669.99కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్ జట్టును అదానీ స్పోర్ట్స్ లైన్ రూ.1289 కోట్లు, ముంబయిని ఇండియా విన్ స్పోర్ట్స్ రూ.912.99కోట్లకు, బెంగళూరును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901కోట్లు, దిల్లీని జేఎస్ డబ్ల్యూ జీఎమ్ఆర్ క్రికెట్ రూ.810కోట్లు, లఖ్‌నవూను క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ రూ. 757కోట్లకు సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.
మహిళల ఐపీఎల్ జట్ల వేలం పూర్తి.. బీసీసీఐకి కాసుల వర్షం.. ఏకంగా అన్ని వేల కోట్లు - bcci women ipl team
మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాట ప్రక్రియ పూర్తైంది. తొలి సీజన్లో పాల్గొననున్న ఐదు జట్లను పలు బడా కంపెనీలు భారీ ధరకు కొనుగోలు చేశాయి.
మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాటు పూర్తి