న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌తో టూర్.. కెప్టెన్లుగా హార్దిక్, ధావన్
19:01 October 31
న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌తో టూర్.. కెప్టెన్లుగా హార్దిక్, ధావన్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. నవంబరు 18నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా... టీ20లకు హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది. ఈ టూర్‌లో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. అయితే టీ20 జట్టులో దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోలేదు. ఇక కేఎల్ రాహుల్ మొత్తం న్యూజిలాంట్ పర్యటనకే దూరమయ్యాడు.
ఇక డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరగబోయే మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే న్యూజిలాండ్ టూర్‌కు మిస్ కానున్న రాహుల్.. బంగ్లా పర్యటనకు వెళ్లనున్నాడు.
- న్యూజిలాండ్‌పై ఆడే టీ20 జట్టు: హార్దిక్ (కెప్టెన్) పంత్ (వైస్ కెప్టెన్), గిల్, కిషన్, హుడా, సూర్య, శ్రేయస్, శాంసన్, సుందర్, చాహల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, సిరాజ్, హర్షల్, భువనేశ్వర్, ఉమ్రాన్.
- న్యూజిలాండ్‌పై ఆడే వన్డే జట్టు: ధావన్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), గిల్, హుడా, సూర్య, శ్రేయస్, శాంసన్, సుందర్, శార్దూల్, షాబాజ్, చాహల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, దీపక్, కుల్‌దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. టూర్‌లో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది.
- బంగ్లాపై ఆడే వన్డే జట్టు: రోహిత్ శర్మ (సారథి), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, డబ్ల్యూ. సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ షమి, సిరాజ్, దీపక్ చాహర్, యష్ డయల్
- బంగ్లాపై ఆడే టెస్టు జట్టు: రోహిత్ శర్మ (సారథి), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (), కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్
ఇదీ చూడండి:బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దినేశ్ కార్తీక్ వర్సెస్ పంత్.. ఆడేది ఎవరో?