తెలంగాణ

telangana

ETV Bharat / sports

BCCI కాంట్రాక్ట్‌ లిస్ట్​ రిలీజ్​.. జ‌డేజాకు ప్ర‌మోష‌న్.. రాహుల్‌కు షాక్.. భరత్​కు చోటు - బీసీసీఐ సెంట్రల్​ కాంట్రాక్ట్​ రోహిత్​ శఱ్మ

టీమ్​ఇండియా ఆట‌గాళ్ల సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ రిలీజ్​ చేసింది. జ‌డేజా, హార్దిక్ పాండ్య ప్ర‌మోష‌న్లు పొందారు. రాహుల్​ మాత్రం ఏ నుంచి బీ గ్రేడ్‌కు ప‌డిపోయాడు.

bcci contract
bcci contract

By

Published : Mar 27, 2023, 10:14 AM IST

2022-23 ఏడాదికి గాను టీమ్​ఇండియా ఆట‌గాళ్ల సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. నాలుగు గ్రేడ్స్‌లో మొత్తం 26 మంది భారత క్రికెట్​ జట్టు ఆట‌గాళ్ల‌కు సెంట్ర‌ల్‌ కాంట్రాక్ట్‌లో చోటు క‌ల్పించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద‌ర‌గొట్టిన భారత క్రికెట్​ జట్టు ఆల్​రౌండర్​ రవీంద్ర జ‌డేజాకు ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఏ ప్ల‌స్ గ్రేడ్ ప్లేయ‌ర్‌గా జ‌డేజా స్థానం సొంతం చేసుకున్నాడు.

మ‌రోవైపు గ‌త కొంత‌కాలంగా వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఏ గ్రేడ్ నుంచి అత‌డిని తొల‌గించి బీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. మరో ఆల్​రౌండ‌ర్ హార్దిక్ పాండ్య బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్ర‌మోష‌న్ పొందాడు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ ఏ గ్రేడ్‌లో స్థానం నిలుపుకోగా.. వెన్ను గాయంతో జ‌ట్టుకు దూరంగా ఉన్నా బుమ్రాకు ఏ ప్ల‌స్ గ్రేడ్‌లో తన స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు.

సెంట్రల్​ కాంట్రాక్ట్ జాబితాతో పాటు గ్రేడ్‌ల వారీగా వార్షిక రెమ్యున‌రేష‌న్స్ కూడా ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఏ ప్ల‌స్ గ్రేడ్ ఆట‌గాళ్ల‌కు రూ. ఏడు కోట్లు, ఏ గ్రేడ్ ఆట‌గాళ్ల‌కు రూ. ఐదు కోట్లు, బీ గ్రేడ్ ఆట‌గాళ్ల‌కు రూ. 3 కోట్లు, సీ గ్రేడ్ క్రికెట‌ర్స్‌కు రూ. కోటి రూపాయ‌లుగా ఫీజును నిర్ణ‌యించింది.

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో చోటు ద‌క్కించుకున్న ప్లేయ‌ర్స్ వీళ్లే!

  • ఏ ప్ల‌స్ గ్రేడ్‌- విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, రవీంద్ర జ‌డేజా
  • ఏ గ్రేడ్‌-హార్దిక్ పాండ్య‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, రిష‌భ్​ పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్‌
  • బీ గ్రేడ్‌- ఛెతేశ్వ‌ర్ పుజారా, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, శుభ్‌మ‌న్ గిల్‌
  • సీ గ్రేడ్‌-ఉమేశ్​ యాద‌వ్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, శార్దూల్ ఠాకూర్‌, ఇషాన్ కిష‌న్‌, దీప‌క్ హుడా, య‌జ్​వేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, సంజూ శాంస‌న్‌, అర్ష‌దీప్‌ సింగ్‌, కేఎస్ భ‌ర‌త్‌

ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో భారత్​ ఓటమిపాలైంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్‌ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమ్​ఇండియా.. సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం టీమ్​ఇండియా ఆటగాళ్లు.. ఐపీఎల్​ ప్రాక్టీస్​ సెషన్​లో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్​ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details