తెలంగాణ

telangana

ETV Bharat / sports

BBL finals: నాలుగోసారి ఛాంపియన్​గా పెర్త్ స్కార్చర్స్ - పెర్త్ స్కార్చర్స్

BBL finals: బిగ్​బాష్​ లీగ్​ ఫైనల్స్​లో ఘన విజయం సాధించింది పెర్త్​ స్కార్చర్స్​. సిడ్నీ సిక్సర్స్​ను 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. నాలుగోసారి టైటిల్​ కైవసం చేసుకుంది.

perth scorchers
పెర్త్ స్కార్చర్స్

By

Published : Jan 28, 2022, 8:15 PM IST

BBL finals: బిగ్​బాష్​ లీగ్​(బీబీఎల్) 2021-22 సీజన్​ ఫైనల్స్​లో విజయం సాధించింది పెర్త్ స్కార్చర్స్. సిడ్నీ సిక్సర్స్​పై 79 పరుగులు తేడాతో గెలిచి టైటిల్​ సొంతం చేసుకుంది. దీంతో నాలుగు సార్లు టైటిల్​ గెలిచిన జట్టుగా నిలిచింది.

పెర్త్​ స్కార్చర్స్​ ఆటగాడు లారీ ఇవాన్స్​ 76 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

మ్యాచ్​ సాగిందిలా..

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన పెర్త్​ స్కార్చర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లారీ ఇవాన్స్ 76, ఆస్టన్ టర్నర్ 54 కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో సిడ్నీ సిక్సర్స్​ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది పెర్త్ స్కార్చర్స్.

172 లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 92 పరుగులకే ఆలౌటైంది. బీబీఎల్​ ఫైనల్లో మూడుసార్లు సిడ్నీ సిక్సర్స్​పై పెర్త్​ విజయం సాధించడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

'రోహిత్-రాహుల్ కాంబో అద్భుతం.. ప్రపంచకప్​ కోసం వెయిటింగ్'

ఐపీఎల్​ చివరి దశకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం!

ABOUT THE AUTHOR

...view details