Sanju Samson: దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి చవిచూసినా.. ఫినిషర్‌గా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మంచి మార్కులే కొట్టేశాడు. జట్టును గెలిపించడానికి 30 పరుగులు అవసరమవ్వగా చివరి వరకు పోరాడి 19 పరుగులు అందించగలిగాడు. అయితే జట్టులో ఫినిషర్ పాత్ర తనకు ఒక్కసారిగా వచ్చింది కాదని అందుకోసం రెండేళ్ల నుంచే కసరత్తులు మొదలైనట్టు తెలిపాడు.
"అవసరమైతే ఫినిషర్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉండాలంటూ సంవత్సరం క్రితమే నాకు ఆదేశాలు అందాయి. అందుకే టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ అన్ని రకాల ఆర్డర్లను ప్రాక్టీస్ చేశాను. రెండేళ్లపాటు ఆటను ఆర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాను. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకున్నాను. గత అనుభవాలను పరిశీలించాను" అంటూ తెలిపాడు.