ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. టెస్టు సిరీస్‌కు ముందు విరామం దొరకడం వల్ల ఎంజాయ్ చేస్తున్నారు. లండన్ పరిసర ప్రాంతాల్లోని పర్యటక ప్రదేశాలకు, వింబుల్డన్ మ్యాచ్‌లు చూస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ మాత్రం తన భార్య అనుష్క శర్మతో కలిసి బ్యాట్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అనుష్క, తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
కొన్నాళ్ల క్రితం ఓ వీడియో షేరింగ్ యాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నకోహ్లీ.. సదరు యాప్‌లో షార్ట్ వీడియోలు చేస్తూ అభిమానులకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇందులో భాగంగా తన భార్యతో కలిసి బ్యాట్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు.