Banning bouncer MCC: క్రికెట్‌లో బౌన్సర్లను నిషేధించాలంటూ కొద్ది కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించింది మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్. షార్ట్-పిచ్ బౌలింగ్‌ను నిషేధించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఫీల్డ్‌లో షార్ట్-పిచ్డ్ బౌలింగ్ అనేది క్రీడలో భాగమని, దానిని మార్చడం ద్వారా ఆట విధానం మారుతుందని ఎంసీసీకి చెందిన జామీ కాక్స్ అన్నారు. కాగా, ఐసీసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లకు మాత్రమే అనుమతి ఉంది.
బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ
Banning bouncer MCC: గత కొన్నాాళ్లుగా క్రికెట్‌లో బౌన్సర్లను నిషేధించాలంటూ వస్తోన్న వాదనలపై స్పందించింది మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్. వాటిని నిషేధించాల్సిన అవసరం లేదని తెలిపింది. అలా చేస్తే ఆట విధానం మారిపోతుందని పేర్కొంది.
short pitch bowling
బౌన్సర్ల వేగం ధాటికి బంతి హెల్మెట్‌కు బలంగా తగిలి చాలా మంది క్రికెటర్లు కంకషన్ బారిన పడ్డారు. అప్పటి నుంచి బౌన్సర్లను నిషేధించడం ఒక్కటే మార్గమని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రమాదకర బౌన్సర్ కారణంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతి చెందారు. ఆ తర్వాత బౌన్సర్లపై నిషేధం విధించాలన్న వాదన మరింత ఎక్కువైంది. ఆ ఆటగాడి అకాల మరణంతో హెల్మెట్ డిజైన్‌లో మార్పులు చేసింది ఎంసీసీ.
ఇదీ చదవండి: వార్న్ చివరి క్షణాల్లో ఏం చేశారంటే?