ఓ దేశవాళీ మ్యాచ్‌లో మితిమీరిన కోపంతో ఒకసారి వికెట్లను తన్నడమే కాక.. మరోసారి పిచ్ నుంచి స్టంప్‌లను పీకి పడేసిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్(Shakib Al Hasan)పై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది. అతడికి బంగ్లా కరెన్సీలో 5 లక్షల టాకాల (5800 డాలర్లు) జరిమానా కూడా పడింది. షకిబ్ ప్రవర్తనకు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని అనుకున్నా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షకిబ్‌ను తక్కువ శిక్షతో అతడిని వదిలి పెట్టింది.
ఫ్యాన్స్‌కు క్షమాపణ
మ్యాచ్ అనంతరం షకిబ్ అల్ హసన్ ఫేస్బుక్ ద్వారా తన ప్రవర్తన పట్ల బహిరంగ క్షమాపణలు(Shakib apologize) కోరాడు. "ప్రియమైన అభిమానులారా, ఇవాళ నా కోపంతో మ్యాచ్‌లో అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నా. నాలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా చేయాల్సింది కాదు.. కానీ, కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఈ సందర్భంగా ఆయా క్రికెట్ జట్లను, టోర్నీ నిర్వాహకులను, మ్యాచ్ పర్యవేక్షకులను క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయనని బలంగా నమ్ముతున్నా" అని షకిబ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి..షకిబుల్ హసన్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం!