Bangladesh Vs New Zealand Test Series : స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 10 వికెట్లతో చెలరేగాడు. దీంతో 150 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది.
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఇందులో తొలి టెస్టు సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 28న ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా ఓపెనర్ (86) పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక శాంటో (37), మోమిముల్ (37) ఫర్వాలేదనిపించారు. మిగతా వారందరూ స్పల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన కివీస్ 317 పరుగులు చేసి కుప్పకూలింది. విలియమ్సన్ (104) సెంచరీ చేసి అద్భుతంగా రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ (42) బ్యాటుతోనూ ప్రతిభ కనబర్చి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ తైజుల్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 338 పరుగులు చేసింది. అయితే కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో మొదటి నుంచే తడబడింది. 181 పరుగులకే చేతులెత్తేసింది. చివరి రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే తైజుల్ చివరి మూడు వికెట్లు పడగొట్టి 10 వికెట్ల ప్రదర్శన చేశాడు.
చారిత్రాత్మక విజయం..
బంగ్లాదేశ్ 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒక్కదాంట్లోనూ గెలవలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడిన చివరి మూడు టెస్టుల్లో రెండింట్లో బంగ్లా విజయం సాధించడం గమనార్హం. దీంతోపాటు సొంతగడ్డపై కివీస్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు టీమ్‌కు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన నజ్ముల్ శాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం.