తెలంగాణ

telangana

ETV Bharat / sports

నయీం, రహీమ్​ హాఫ్​ సెంచరీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం - శ్రీలంక X బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బంగ్లాదేశ్​ ఓపెనర్ నయీం(62), రహీమ్(57*) అర్థశతకాలతో రాణించారు.

bangladesh team
బంగ్లాదేశ్ జట్టు

By

Published : Oct 24, 2021, 5:38 PM IST

Updated : Oct 24, 2021, 6:08 PM IST

కఠినమైన పిచ్‌లపై బంగ్లాదేశ్‌ ఓపెనర్ మహమ్మద్‌ నయీం (62), రహీమ్‌ (57*) అర్దశతకాలు సాధించారు. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 పోటీల్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో లంకకు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లిటన్ దాస్‌ (16)తో కలిసి నయీం తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలో లిటన్‌, షకిబ్ అల్ హసన్ (10) ఔటైనా.. ముష్ఫికర్‌ రహీమ్‌-నయీం జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అయితే నయీం పెవిలియన్‌కు చేరడంతో రహీమ్ బ్యాట్‌ను ఝళిపించాడు. అఫిఫ్‌ హోసైన్ 7 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో చమిక, ఫెర్నాండో,లాహిరు కుమార తలో వికెట్ తీశారు.

భారీ షాట్లు లేవు.. అయినా భారీ స్కోరే..

లంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ షాట్లు పెద్దగా లేవు. నయీం నిలకడగా బ్యాటింగ్‌ చేసినా వేగంగా పరుగులు చేయలేదు. అయినా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ కాస్త దూకుడును ప్రదర్శించాడు. ఆఖర్లో మహమ్మదుల్లా (5 బంతుల్లో 10 పరుగులు నాటౌట్) బ్యాట్ ఝళిపించాడు. దీంతో లంకకు బంగ్లా భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. శ్రీలంక బౌలర్లలో చమీరా (4-0-41-0) విఫలం కాగా.. వహిందు హసరంగ (3-0-29-0) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. లాహిరు కుమార (4-0-29-1), చమిక (3-0-12-1), శనక (2-0-14-0), బినుర ఫెర్నాండో (3-0-27-1) ఫర్వాలేదనిపించారు.

ఇదీ చదవండి:

IND vs PAK T20: 'ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్​పై గెలుపు'

Last Updated : Oct 24, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details