తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ క్రికెటర్​ షర్ట్​ పట్టుకుని లాగేసిన ఫ్యాన్స్.. కొంచెం ఉంటే కింద పడిపోయేవాడే! - షకీబ్​ అల్​ హసన్ ఇంగ్లాండ్​ వార్తలు

బంగ్లాదేశ్​ స్టార్​​ క్రికెటర్ షకీబ్​ అల్​​ హసన్​కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమానికి వెళ్లిన అతడిని ఫ్యాన్స్​ చుట్టేముట్టేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. హసన్​ షర్ట్ పట్టుకుని లాగేశాడు. దీంతో అతడు కింద పడినంత పనైంది.

bangladesh allrounder shakib al hasan mobbed by fans video viral
bangladesh allrounder shakib al hasan mobbed by fans video viral

By

Published : Mar 17, 2023, 1:03 PM IST

ఏ రంగంలో అయినా పాపులర్ అయితే వారికి కష్టాలు తప్పవు! అదే సినిమాలు, క్రికెట్ వంటి రంగాల్లో అయితే ఫ్యాన్స్ చుట్టుముట్టడం వల్ల సెలెబ్రిటీలకు ఊపిరి తీసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టం అయిపోతుంటోంది. ఇలాంటి అనుభవమే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్​ అల్ హసన్‌కు ఎదురైంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు షకీబ్​ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చే సమయంలో అతడిని ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. తమ అభిమాన క్రికెటర్‌తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. షకీబ్​తో పాటు ఉన్న మరికొందరు కూడా ఆ అభిమానుల తాకిడిని తట్టుకోలేకపోయారు.

ఈ క్రమంలో కొందరైతే మరో అడుగు ముందుకేసి హసన్ చొక్క పట్టుకొని లాగేశారు. బలవంతంగా తమ దగ్గరకు లాక్కొని ఫొటోలు దిగేందుకు యత్నించారు. ఈ సమయంలో హసన్ దాదాపు కింద పడినంత పనైంది. ఎలాగోలా బ్యాలెన్స్ నిలుపుకున్న అతడు.. అక్కడి నుంచి తప్పించుకొని కారు ఎక్కేశాడు. ఈ సమయంలో అతడి చుట్టూ బాడీగార్డులు లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

అయితే ఎప్పుడూ చిన్నచిన్న విషయాలకు కూడా చిరాకు పడిపోయే హసన్.. ఇంత జరిగినా అభిమానులపై కోప్పడకపోవడం చూసి కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల క్రితం ఇలాగే అభిమానులు చుట్టుముట్టినప్పుడు హసన్ కోపంతో రెచ్చిపోయాడు. ఒక ఫ్యాన్‌ను తలపై తన టోపీతో బాదేశాడు. ఈ గొడవ మరింత పెద్దది అవ్వకముందే సెక్యూరిటీ వాళ్లు కల్పించుకొని హసన్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లిపోయారు. ఇదిలా వుండగా తాజాగా విశ్వవిజేత ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

కొద్దిరోజుల క్రితమే.. టీమ్​ఇండియా క్రికెటర్​ పృథ్వీ షా పై కొందరు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్టార్​ ఆటగాడు పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి ముంబయిలో శాంతా క్రూజ్​లోని ఓ ఫైవ్​ స్టార్​ హోటల్​కు వెళ్లాడు. అక్కడ షాను చూసిన కొందరూ సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అక్కడున్న ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు పృథ్వీ ఆసక్తి చూపించడంతో మిగతా వారు అసహనం వ్యక్తం చేశారు. తమతో కూడా ఫొటో దిగాలని కోరారు. దానికి షా నిరాకరించడంతో సదరు వ్యక్తులు తమకు సెల్ఫీ ఇచ్చే తీరాలంటూ డిమాండ్​ చేశారు. దీంతో అక్కడే ఉన్న షా స్నేహితుడు హోటల్​ మేనేజర్​కు కంప్లైంట్​ చేశాడు. అక్కడికి వచ్చిన మేనేజర్​ నిందితులను వెళ్లగొట్టాడు.ఇదంతా మనసులో పెట్టుకున్న నిందితుల్లోని ఓ మహిళ.. షా కారును వెంబడించింది. అంతే కాకుండా అతడితో వాగ్వవాదానికి దిగింది. అతడిపై దాడి కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details