తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాల్ ట్యాంపరింగ్ రగడపై బాన్​క్రాఫ్ట్ వెనకడుగు! - సాండ్ పేపర్ గేట్

బాల్​ టాంపరింగ్ విషయంలో వెనక్కి తగ్గాడు ఆసీస్ క్రికెటర్ కామెరూన్​ బాన్​క్రాఫ్ట్. సాండ్ పేపర్ గేట్ వివాదంలో కొత్తగా చెప్పాల్సిన సమాచారమేమీ లేదని స్పష్టం చేశాడు.

Cameron Bancroft, Ball-tampering
కామెరూన్​ బాన్​క్రాఫ్ట్, ఆసీస్ క్రికెటర్

By

Published : May 18, 2021, 3:28 PM IST

బాల్​ టాంపరింగ్​ వివాదాన్ని తెరపైకి తెచ్చిన ఆసీస్ ఆటగాడు కామెరూన్ బాన్​క్రాఫ్ట్​.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ వివాదం గురించి చెప్పడానికి కొత్త సమాచారమేమీ లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ విభాగంతో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రస్తుతం యూకేలోని కౌంటీల్లో దుర్హామ్​ తరఫున ఆడుతున్న బాన్​క్రాఫ్ట్​ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ విభాగం ప్రతినిధుల బృందం కలిసింది. సాండ్​ పేపర్ వివాదంపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే తెలియజేయాలని కోరింది. అందుకు రాజీ పద్ధతిలో స్పందించాడు బాన్​క్రాఫ్ట్. ఆ వివాదానికి సంబంధించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియా క్రికెట్లో బాన్​క్రాఫ్ట్ కలకలం

గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన దర్యాప్తునకు మద్దతు తెలిపానని.. వారిచ్చిన ఫలితంతో సంతృప్తిగా ఉన్నట్లు బాన్​క్రాఫ్ట్ స్పష్టం చేశాడు.

2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా బంతికి ఉప్పు కాగితం రుద్ది అడ్డంగా దొరికిపోయాడు బాన్​క్రాఫ్ట్. ఇందులో కెప్టెన్ స్మిత్​తో పాటు వైస్​ కెప్టెన్ వార్నర్​ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆ వివాదం గురించి ఆనాటి జట్టులోని బౌలర్లకు కూడా తెలుసని బాన్​క్రాఫ్ట్ ఇటీవల​ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీనిపై మరోసారి దర్యాప్తు చేయడానికి కూడా సిద్ధమని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'బాల్ టాంపరింగ్ వివాదంపై వార్నర్ బుక్ రాయాలి'

ABOUT THE AUTHOR

...view details