Ban Vs NZ 1st Test : బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా గురువారం న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విజృంభించాడు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో. అరంగేట్రం చేసిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో విరుచుకుపడ్డాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో శాంటో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నజ్ముల్ చేసిన ఈ ఫీట్.. న్యూజిలాండ్‌పై 205 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించడంలో బంగ్లాదేశ్‌కు సహాయపడింది. దీంతో టెస్టుల్లో తన 5వ సెంచరీని నమోదు చేసుకున్నాడు శాంటో.
తొలి బంగ్లా క్రికెటర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షాంటో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో సెంచరీ సాధించిన కెప్టెన్‌గా, తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా షాంటో చరిత్ర సృష్టించాడు. మొత్తంగా టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో శకతం బాదిన 32వ క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి దిగ్గజ క్రికెటర్లూ ఉన్నారు.
కేన్ కూడా..
మరోవైపు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ సిరీస్‌లో కీలకమైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీని పూర్తి చేసి ఆల్‌టైమ్ గ్రేట్, ఆసీస్ దిగ్గజం బ్రాడ్‌మన్, టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. ఇదే తొలి టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ 205 బంతుల్లో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. 95వ టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.