బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది టీమ్ఇండియా. ప్రస్తుతం డిసెంబర్ 22న జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు భారత క్రికెటర్లు.. పలు రికార్డులకు అడుగు దూరంలో ఉన్నారు. అవేంటంటే..
మరో ఆరు సాధిస్తే..భారత జట్టులోకి ఆలస్యంగా వచ్చిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ తన కెరీర్లో ఇప్పటి వరకు తన టెస్టు కెరీర్లో 44 వికెట్లు తీశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌లో మరో ఆరు వికెట్లు పడగొట్టగలిగితే టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మరో భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు మీద ఉంది. అతడు 2012లో తన తొమ్మిదో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 50వ వికెట్ తీశాడు.