సౌథాంప్టన్‌లో జరుగుతున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final) భారత్‌పై మూడో రోజు పైచేయి సాధించింది న్యూజిలాండ్. టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు మరో నాలుగు వికెట్లు తీసిన కివీస్ పేసర్ కైల్ జెమీసన్(Kyle Jamieson) అదరగొట్టాడు. తాను వేసిన బంతి కోహ్లీనే కాదు ఎవరైనా సరే ఔట్ కావాల్సిందేనని అన్నాడు.
"విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు న్యూజిలాండ్ ఒకే వ్యూహం అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఆ దేశంలో ఆడినప్పుడూ ఔట్‌స్వింగర్లతో విసిగించి అకస్మాత్తుగా ఇన్‌స్వింగర్ విసిరి ఔట్ చేశారు. ఇప్పుడూ దానినే అనుసరించారా" అని ప్రశ్నించగా.. "ఓహ్.. అవుననే అనుకుంటాను. బహుశా మేం ఈ వ్యూహం గురించే ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. విరాట్ కోహ్లీని ఔట్ చేసిన బంతిని కాస్త బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌గా విసిరాను. దానిని నియంత్రించడం ఏ బౌలర్‌కైనా కష్టమే. మెరుగ్గా ఆడటం ఏ బ్యాటర్‌కైనా ఇబ్బందే. అది కేవలం కోహ్లీ కోసమే కాదు" అని జేమీసన్ చెప్పాడు.
విరాట్ కోహ్లీది కీలకమైన వికెట్ అని జెమీసన్ అన్నాడు. "అవును, విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియాలో అత్యంత కీలకం. అతడిని ఔట్ చేయడం సులభం కాదు. ఉదయం త్వరగా అతడిని ఔట్ చేయడం మాకు ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత ఆట మాకు అనుకూలంగానే సాగింది. నిజానికి కోహ్లీ బ్యాటింగ్‌లో సాంకేతిక సమస్యలేమీ కనిపించవు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. ఏదేమైనా నిలకడగా బంతిని రెండువైపులా స్వింగ్ చేయడం సంతృప్తి కలిగించింది. దాంతోనే విరాట్‌ను నియంత్రణలో ఉంచాం" అని అతడు వివరించాడు.