Ball Stuck In Wicket Keeper Pad :క్రికెట్‌లో సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో అప్పుడప్పుడు వింత సంఘటనలు కాసేపు నవ్వులు పూయిస్తాయి. అయితే తాజాగా యూరోపియన్ టీ10 క్రికెట్ లీగ్‌లో అలాంటి సంఘటనే జరిగింది. ఈ టోర్నీలో భాగంగా మ్యాజిక్ సీసీ - రాయల్ బార్సిలోనా జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాజిక్ సీసీ 9.5 ఓవర్లకు 155-4 వద్ద నిలిచింది.
ఇన్నింగ్స్ ఆఖరి బంతిని షాట్‌గా మలచడంలో బ్యాటర్ విఫలమయ్యాడు. దీంతో క్రీజులో ఉన్న బ్యాటర్లు పరుగులు తీస్తున్నారు. అయితే ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కు విసరగా, అది అతడి ప్యాడ్‌లో చిక్కుకుంది. దీంతో బ్యాటర్లు అదనంగా మరో పరుగు తీశారు. వాళ్లను ఔట్ చేసే ఈ క్రమంలో, కీపర్ బంతిని బౌలర్ ఎండ్‌కు విసరగా అతడు బంతిని అందుకోలేదు. దీంత క్రీజులో ఉన్న బ్యాటర్లు నాలుగో పరుగుకు కూడా ప్రయత్నించారు. కానీ, ఈసారి అదృష్టం వారిని వరించలేదు. నాలుగో పరుగు పూర్తికాక ముందే రనౌటయ్యాడు. ఇక ఇన్నింగ్స్‌ను 158-5తో ముగించారు. అనంతరం ఛేజింగ్‌లో రాయల్ బార్సిలోనా జట్టు 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకొని విజయం నమోదు చేసింది.
విచిత్రమైన కారణంతో మ్యాచ్ రద్దు
ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ 2023లో విచిత్ర పరిణామం జరిగింది. టోర్నీలో భాగంగా ఆదివారం మెల్బోర్న్ రెనెగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య, గీలాంగ్ సైమండ్స్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా రద్దైంది. టాస్ నెగ్గిన మెల్బోర్న్, పెర్త్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఈ క్రమంలో పెర్త్ 18 పరుగులకే ఓపెనర్లు స్టీఫెన్ (0), కూపర్ (6) వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది.