అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గెలుచుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో అద్భతంగా ఆడినందుకుగాను అతడిని ఈ అవార్డు వరించింది.
ఈ సిరీస్లో మూడో వన్డేలో 82 బంతుల్లో 94 పరుగులు, మూడో టీ20లో 59 బంతుల్లో 122 పరుగులు చేసి మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు బాబర్. దీంతో అతడు 13 పాయింట్లు దక్కించుకుని, కెరీర్లో అత్యుత్తమంగా 865 పాయింట్ల సంపాదించాడు.