పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. కోహ్లీని అధిగమించాడు. గత మూడేళ్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న విరాట్‌ను వెనక్కు నెట్టి, ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేలో 94 పరుగులు చేసిన బాబర్.. 13 రేటింగ్ పాయింట్లు సాధించి, అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇతడు 865, కోహ్లీ 857 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
పాక్ తరఫున వన్డేల్లో టాప్ ర్యాంక్ అందుకున్న నాలుగో బ్యాట్స్‌మన్ బాబర్. ఇతడి కంటే ముందు జహీర్ అబ్బాస్, జావేది మియాందాద్, మహమ్మద్ యూసఫ్ ఈ ఘనత సాధించారు.