తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం' - టీ20 ప్రపంచకప్​ పాకిస్థాన్​ వర్సెస్​ టీమ్​ఇండియా

Babar azam on India vs Pakistan: టీ20 ప్రపంచకప్​లో భారత్​పై పది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నాడు పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​. అయితే ఈ మెగాటోర్నీ సెమీస్​లో ఆసీస్​ చేతిలో ఓడిపోవడం నుంచి గుణపాఠం నేర్చుకున్నట్లు తెలిపాడు. ​

IND Vs Pak
IND Vs Pak

By

Published : Jan 1, 2022, 11:53 AM IST

Babar azam on India vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఎప్పటికీ మరువలేమని పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ తెలిపాడు. పీసీబీ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. గతేడాది తమ జట్టు సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి తన జట్టు సభ్యులను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రపంచస్థాయి అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్‌ను ఎదుర్కోవడమంటే చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పాడు.

"భారత్‌పై విజయం సాధించడం అంటే.. మాటల్లో చెప్పలేను. గత రికార్డుల గురించి అసలు ఆలోచించలేదు. అప్పుడు (అప్పటి మ్యాచ్) ఏం చేయాలనే దానిపైనే దృష్టిపెట్టాం. మ్యాచ్‌లో మా ప్రారంభం, ముగింపును తలచుకుంటే అద్భుతం. అభిమానుల నుంచి వచ్చిన స్పందన కూడా అపూర్వం. ఇదంతా జట్టు సభ్యుల సమష్టి కృషి. మ్యాచ్‌ను గెలవగలమని నమ్మామే కానీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోలేదు" అని వివరించాడు.

టీ20 ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ నుంచే దూకుడుగా ఆడిన పాకిస్థాన్‌ గ్రూప్‌ స్టేజ్‌లో ఓటమి లేకుండా సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే అక్కడ ఆసీస్‌ చేతిలో భంగపాటు తప్పలేదు. దీనిపై బాబర్ స్పందిస్తూ "ప్రపంచకప్‌ గ్రూప్‌ పోటీల్లో ఆధిపత్యం చెలాయిస్తూ రాణించాం. అయితే దురదృష్టవశాత్తూ సెమీస్‌లో ఓడిపోయాం. చేసిన పొరపాట్లు ఒక్కోసారి ఫలితంపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయనేదానికి సెమీస్‌ చక్కటి ఉదాహరణ. అయితే ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. వచ్చేసారి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కష్టపడతాం" అని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: 'కెప్టెన్​గా రాహులే​ సరైనోడు.. రుతురాజ్​ వండర్స్​ చేస్తాడు'

ABOUT THE AUTHOR

...view details