ఆసియా కప్ భాగంగా ఆఖరి సూపరి4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. ఈ రెండు జట్లు మళ్లీ ఫైనల్లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన వైరల్‌గా మారింది. లంక ఇన్నింగ్స్ 16వ ఓవర్లో హసన్ అలీ వేసిన బంతి బౌన్సర్‌గా కీపర్ చేతిలో పడింది. వెంటనే మహమ్మద్ రిజ్వాన్ రివ్యూ కోసం సిగ్నల్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్ సైతం కెప్టెన్ ఎవరనే విషయం మరిచి థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు.
దాంతో తీవ్ర అసహనానికి గురైన బాబర్.. 'కెప్టెన్ నేనే' అంటూ సైగలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తాను రివ్యూ అడగకుండానే ఎలా సమీక్ష కోరతారని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ టీమ్ రివ్యూ తీసుకోవాలంటే కెప్టెన్ మాత్రమే కోరాలి. కానీ ఇక్కడ రిజ్వాన్ అడగ్గానే రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది.