తెలంగాణ

telangana

ETV Bharat / sports

మళ్లీ హ్యాట్రిక్​ సెంచరీలతో 'బాబర్​'​ రికార్డ్​.. కోహ్లీని దాటి..!

Babar Azam: వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్. కెప్టెన్​గా అతితక్కువ ఇన్నింగ్స్​ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

Babar Azam
babar azam vs virat kohli

By

Published : Jun 9, 2022, 12:18 PM IST

Babar Azam: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అజామ్‌ ఇప్పుడు దాన్ని 13 ఇన్నింగ్సుల్లోనే పూర్తి చేశాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అతడు 103 పరుగులు సాధించి ఈ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్‌ 18 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలవగా.. కేన్‌ విలియమ్సన్‌ 20 ఇన్నింగ్స్‌, అలిస్టర్‌ కుక్‌ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మరోవైపు బాబర్‌ ఈ శతకంతో వన్డేల్లో రెండోసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇది వరకు 2016లో ఇదే వెస్టిండీస్‌ జట్టుపై యూఏఈలో 120, 123, 117 పరుగులు సాధించిన అతడు.. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 114, 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా విండీస్‌పైన మరో శతకం బాది సత్తా చాటాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీబియన్‌ జట్టు 305/8 భారీ స్కోర్‌ సాధించింది. షై హోప్‌ 127తో రాణించాడు. పాకిస్థాన్‌ జట్టులో బాబర్‌తో పాటు రిజ్వాన్‌ (59), ఖుష్దిల్​ షా (41) మెరవడం వల్ల నాలుగు బంతులు మిగిలుండగానే గెలిచింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details