హైదరాబాద్ క్రికెట్ సంఘం(Hyderabad Cricket Association) అధ్యక్షుడిగా ఉన్న తనకు నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ అజహరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించి అపెక్స్ కౌన్సిల్‌పై మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు ఇచ్చే హక్కు లేదని చెప్పారు. కౌన్సిల్‌లో మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొందరు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని వెల్లడించారు.
"అపెక్స్ కౌన్సిల్‌కు ఎవరినీ బహిష్కరించే అధికారం లేదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా కౌన్సిల్ పట్టించుకోవడం లేదు. ఎవరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారో అందరికీ తెలుసు. పాతికేళ్లుగా కొందరు గుత్తాధిపత్యం వహిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి అవుతుంది?పాతికేళ్లుగా నిధులన్నీ ఏమైపోతున్నాయి? నిధులున్నా ఎందుకు మైదానాలు అభివృద్ధి చేయలేదు? క్రీడామైదానాల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు" అని అజహర్ ఆరోపించారు.
ఇదీ జరిగింది