హైదరాబాద్ క్రికెట్ సంఘం(hyderabad cricket association) అధ్యక్షుడి అయిన తనకు నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ అజహరుద్దీన్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదని అన్నారు. అపెక్స్ కౌన్సిల్లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారని తెలిపారు. తాము చేసిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు.
HCA issue: అజహరుద్దీన్- అపెక్స్ కౌన్సిల్ మధ్య రగడ - క్రికెట్ న్యూస్
హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా తనను సస్పెండ్ చేయడంపై అజహరుద్దీన్ ఘాటుగా స్పందించారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ కూడా తక్షణమే స్పందించింది. ఇప్పటి నుంచి ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని తేల్చి చెప్పింది.
హెచ్‌సీఏలో జరుగుతున్న జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థమంతమైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పు పట్టారని అజహరుద్దీన్ పేర్కొన్నారు. వాళ్ల అవినీతి బయట పడుతుందనే ఇలా చేశారని ఆరోపించారు.
ఈ విషయంపై తక్షణమే హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కూడా స్పందించింది. లోధా సిఫార్సుల మేరకే నోటిసులు ఇచ్చామని స్పష్టం చేసింది. కౌన్సిల్లో వర్గాలు ఉన్నాయని అజహరుద్దీన్ అనడం సరికాదని చెప్పింది. ఈరోజు(గురువారం) నుంచి అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని వెల్లడించింది. వీలైతే ఆయన కోర్టుకు వెళ్లి పోరాటం చేసుకోవచ్చని తెలిపింది. బీసీసీఐ జోక్యం ఈ విషయంలో ఉండదని తేల్చి చెప్పింది.