Avesh Khan Replaced Shami :సౌతాఫ్రికా పర్యటన టెస్టు సిరీస్‌లో పేసర్ మహ్మద్ షమీ స్థానాన్ని యంగ్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఆవేశ్ జట్టుతో కలవనున్నాడు. ఈ పర్యటనతోనే అవేశ్ ఖాన్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక సౌతాఫ్రికా- భారత్ మధ్య రెండో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో సఫారీ జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో నెగ్గి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Shami Ruled Out : టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీ ఇటీవల గాయపడ్డాడు. కాలిచీలమండల (Ankle Injury) గాయం నుంచి కోలుకుంటున్న షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఈ కారణంగా షమీ సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఎంపికకాలేదు. కాగా, తాజాగా అతడి రిప్లేస్‌మెంట్‌గా ఆవేశ్‌ను బీసీసీఐ ప్రకటించింది.
బ్రేక్ తీసుకున్న ఇషాన్: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇటీవల ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా అతడికి రెస్ట్ ఇవ్వాల్సిందిగా బీసీసీఐని ఇషాన్ కోరాడు. దీంతో అతడి అభ్యర్థన మేరకు బీసీసీఐ కూడా విశ్రాంతినిచ్చింది. సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను ఎంపికచేసింది. కాగా ఇప్పటికే భరత్ జట్టుతో కలిశాడు.