AUSW vs ENGW: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్ అదరగొట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఎందుకు బౌలింగ్ ఎంచుకున్నామో అని బాధపడేలా విరుచుకుపడింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఓపెనర్ అలీసా హేలీ.. ఈ మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆఖర్లో వెనుదిరిగింది. ఇందులో ఏకంగా 26 ఫోర్లు ఉండటం విశేషం. మహిళల ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది హేలీ. అంతకుముందు 2005లో ఆసీస్‌కే చెందిన రోల్టన్ శతకం చేసింది.
ప్రపంచ రికార్డు: ఓ ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది హేలీ. పురుషుల క్రికెట్లోనూ ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్, మాజీ ప్లేయర్ ఆడం గిల్‌క్రిస్ట్ 2007 పురుషుల క్రికెట్ వరల్కప్ ఫైనల్లో చేసిన 149 పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉంది. ఇప్పుడు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన హేలీ.. దాన్ని బ్రేక్ చేసింది.
- 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో పాంటింగ్(ఆసీస్) భారత్‌పై 140 పరుగులు చేశాడు.
- 1979 ఫైనల్లో వివ్ రిచర్డ్స్ ఇంగ్లాండ్‌పై 138 పరుగులు చేశాడు.
మహిళల వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా హేలీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 56.56 సగటుతో 509 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
- తన భర్త, ఆసీస్ స్టార్‌పేసర్ మిచెల్ స్టార్క్ 2019 పురుషుల వన్డే వరల్డ్‌కప్‌లో 27 వికెట్లు తీశాడు. ఓ ఐసీసీ టోర్నీలో బౌలర్ తీసిన అత్యధిక వికెట్లు ఇవే.
- ఇప్పుడు హేలీ.. ఓ ఉమెన్స్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.