Aaron Finch Retirment: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతాడా లేదా అనే విషయంపై ఫించ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. శనివారం ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. రికీ పాంటింగ్, డేవిడ్ వార్నర్ తర్వాత ఆస్ట్రేలియా తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడుగా ఆరోన్ ఫించ్ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై - Aaron Finch One Day Cricket Retirement
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్లేయర్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే మిగతా ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతాడా లేదా అనే విషయంపై ఫించ్ క్లారిటీ ఇవ్వలేదు.
australian-batsman-aaron-finch-announces-retirement
కాగా కెప్టెన్‌గా జట్టును విజయాల బాటలో నడిపిస్తున్న ఫించ్.. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు. గత తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి:90 మీటర్ల మార్క్.. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: నీరజ్ చోప్రా
Last Updated : Sep 10, 2022, 8:09 AM IST