టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా గెలుపొందింది. లంక నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే కంగారు జట్టు ఛేదించింది. డేవిడ్ వార్నర్ (65; 42 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధశతకంతో అదరగొట్టగా.. ఆరోన్ ఫించ్ (37; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. లంక బౌలర్లలో హసలంక రెండు, శనక ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. చరిత్ అసలంక (35), కుశాల్ పెరీరా (35), భానుక రాజపక్సే (33) పరుగులు చేశారు. శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ పీతమ్ నిశాంక (7) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక.. మరో ఓపెనర్ కుశాల్ పెరీరాతో కలిసి వేగంగా ఆడాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక స్కోరు 53/1 గా ఉంది. ధాటిగా ఆడుతున్న క్రమంలో ఆడమ్ జంపా వేసిన పదో ఓవర్లో అసలంక.. స్మిత్‌కి చిక్కి పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లోనే కుశాల్ పెరీరా కూడా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి అవిష్క ఫెర్నాండో (4), వానిండు హసరంగ (4), డాసున్ శనక (12) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన భానుక రాజపక్సే వేగంగా ఆడాడు. చమిక కరుణ రత్నే (9) పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక మోస్తరు స్కోరును చేయగలిగింది.