Australia Vs South Africa : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. 49 ఓవర్లలో 222 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా 114 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అతడితో పాటు మార్కో జానెసన్ క్రీజులో రాణించాడు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..స్టోయినిస్ రెండు, అబాట్, అగర్, జంపా, గ్రీన్ తలో వికెట్‌ను సాధించారు.
223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ సేన.. 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. సరిగ్గా అదే సమయానికి క్రీజులోకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా దిగిన మార్నస్ లూబుషేన్.. మైదానంలో చెలరేగిపోయాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలోకి నడిపించాడు.
SA Vs Aus 1st ODI : అయితే తొలుత తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు. కానీ కామెరూన్ గ్రీన్ తలకు గాయం కావడం వల్ల కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశాన్ని మార్నస్‌కు ఇచ్చారు. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లబుషేన్..93 బంతుల్లో 80 పరుగులు తీసి జట్టుకు అండగా నిలిచాడు. ఇక అతడికి తోడైనా అస్టన్ అగర్ 44 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టిన లబుషేన్‌ను 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది.