తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరి టెస్టుకీ స్టీవ్​ స్మితే కెప్టెన్​.. చీఫ్​ గెస్ట్​లుగా ఇద్దరు ప్రధానులు - Steve Smith As Captain For Fourth Test

బోర్డర్-గావస్కర్​ ట్రోఫీ సిరీస్​లో భాగంగా జరిగే చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్​కి కూడా కెప్టెన్​ స్టీవ్​ స్మితే సారథిగా వ్యవహరించనున్నాడని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ప్రకటించింది. మరోవైపు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగబోయే ఈ మ్యాచ్​కి చీఫ్​ గెస్ట్​లు​గా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ​ హాజరు కానున్నారు.

Steve Smith As Captain For Fourth Test
భారత్​తో నాల్గో టెస్టుకి కెప్టెన్​గా స్టీవ్​ స్మిత్​

By

Published : Mar 6, 2023, 6:31 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్​ ట్రోఫీ సిరీస్​లో భాగంగా జరిగే చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్​కి కూడా కెప్టెన్​ స్టీవ్​ స్మితే సారథిగా వ్యవహరించనున్నాడని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ప్రకటించింది. కాగా, ఈ మ్యాచ్​ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్​ వేదికగా జరగనుంది. అంతకుముందు తొలి రెండు టెస్టులకు పాట్​ కమిన్స్​ సారథిగా ఉన్నాడు. అయితే తన తల్లి మారియా రోమ్ము​ క్యాన్సర్​తో బాధపడుతుండటం వల్ల దిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్​ తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు కమిన్స్​. దీంతో తాత్కాలికంగా మూడో టెస్టుకు స్టీవ్​ స్మిత్​ను కెప్టెన్​గా ఎంపిక చేసింది ఆసీస్​ క్రికెట్​ బోర్డు. అయితే, కమిన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల చివరి మ్యాచ్​కి కూడా అతడే కెప్టెన్​గా కొనసాగుతాడని స్పష్టం చేశారు సెలెక్టర్లు.

తాజాగా ఇందౌర్​లో జరిగిన మూడో టెస్టుకు స్మిత్​ కెప్టెన్​గా వ్యవహరించాడు. భారత్​​ పర్యటనలో ఉన్న ఆసీస్​.. మొదటి విజయాన్ని ఇతడి సారథ్యంలోనే మూడో టెస్టులో నమోదు చేసింది. ఈ మ్యాచ్​లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించారు కంగారులు. ఈ విజయంతో జూన్ 7న లండన్​లోని ఓవల్‌ స్టేడియంలో జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23కు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది ఆసీస్. అయితే​ ఫైనల్​లో తమతో పోటీ పడేందుకు భారత్​ లేదా శ్రీలంక జట్లలో ఏది వస్తుందో అని ఎదురు చూస్తోంది ఆస్ట్రేలియా.

గతేడాది వన్డే సిరీస్​కు వీడ్కోలు పలిగిన ఆరోన్​ ఫించ్​ స్థానంలో వన్డేకు సారథిగా నియమితుడయ్యాడు కమిన్స్​. అయితే ఈ నెల 17న ముంబయి వేదికగా భారత్​తో జరగబోయే వన్డే సిరీస్‌కు పాట్​ కమిన్స్ అందుబాటులో ఉంటాడా.. లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

చీఫ్​ గెస్ట్​లు​గా ఇద్దరు ప్రధానులు..
అయితే మార్చి 9న అహ్మదాబాద్‌లో జరిగే బోర్డర్-గావస్కర్​ ట్రోఫీలో చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్​ మొదటి రోజు ఆటను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ రానున్నారు. ఈ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్‌ గెలిచి టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

ABOUT THE AUTHOR

...view details