Australia Vs Afghanistan World Cup 2023 : వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు అదరగొట్టేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్; 143 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. దీంతో ఆసీస్‌కు 292 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ నిర్దేశించింది.
ఇక అఫ్గాన్ బ్యాటర్లు గుర్బాజ్ (21), రహ్మాత్ షా (30), షాహిది (26), ఒమర్జాయ్ (26), నబీ(12) పరుగులు చేశారు. ఆఖర్లో రషీద్ ఖాన్ (35)*(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, మ్యాక్స్‌వెల్, జంపా తలో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన జద్రాన్..
ఓ వైపు వికెట్లు పడినా అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129*) మాత్రం నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో కెరీర్‌లో ఐదో సెంచరీని పూర్తి చేశాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన అఫ్గాన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన తొలి అఫ్గాన్ బ్యాటర్ కూడా జద్రాన్ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా పిన్న వయస్సులో వరల్డ్ కప్ శతకం చేసిన నాలుగో బ్యాటర్ జద్రాన్. ఈ అఫ్గాన్ బ్యాటర్ 21 ఏళ్ల 330 రోజుల వయసులో శతకం బాదాడు.