India Vs Australia Second T20 Match Preview :ఆస్ర్టేలియా జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్నమ్యాచ్‌కు ఇరుజట్లు సన్నద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కూడా .. గెలిచి అధిక్యం సాధించాలని.. యువ భారత్ పట్టుదలగా ఉంది. ఆసీస్ కూడా బోణీ కొట్టాలని చూస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ బౌలర్లకు .. ప్రధానంగా స్పిన్నర్లకు సహరికంచే అవకాశం ఉండడం వల్ల తక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ స్టేడియంలో మెుత్తం 3 అంతర్జాతీయ టీ20మ్యాచ్‌లు జరగగా.. రెండింటిలో ఛేజింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
విశాఖలో జరిగిన మెుదటి టీ-20లో రాణించిన.. కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, రింకూసింగ్‌లు.. మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. దురదృష్టవశాత్తు మెుదటి మ్యాచ్‌లో రనౌటైన.. రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో రాణించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మొదటి టీ-20 మ్యాచ్‌లో.. భారత్ బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యింది. పేసర్ ముఖేశ్ కుమార్ మినహా బౌలర్లంతా విఫలమయ్యారు. పేసర్లు అర్షదీప్ సింగ్, ప్రసిద్ధకృష్ణలు.. ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు పూర్తిగా విఫలమయ్యారు. గ్రీన్‌ఫీల్డ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావటం వల్ల.. వారి ప్రదర్శనపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.