Australia Tour Of India 2023 Team India Squad :ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ. రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఇక ఇటీవల వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి సూర్యకుమార్‌తో పాటు ప్రిసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్‌ను తీసుకుంది. వరల్డ్ కప్‌తో అలసి పోయిన శ్ర్రేయస్ అయ్యర్‌కు మూడు మ్యాచ్‌ల వరకు రెస్ట్ ఇచ్చింది. అయితే అయ్యర్ డిసెంబర్ 3న రాయ్‌పుర్‌లో జరిగే మ్యాచ్‌లో వైస్ కెప్టెన్‌గా రాయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
భారత జట్టు :సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (WK), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్- టీ20 సిరీస్
క్ర.సం. | తేదీ | మ్యాచ్ | వేదిక |
1 | నవంబర్ 23 | 1వ T20I | విశాఖపట్నం |
2 | నవంబర్ 26 | 2వ T20I | తిరువనంతపురం |
3 | నవంబర్ 28 | 3వ T20I | గువాహటి |
4 | డిసెంబర్ 1 | 4వ T20I | రాయ్‌పుర్ |
5 | డిసెంబర్ 3 | 5వ T20I | బెంగళూరు |