Shane Warne Accident: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు యాక్సిడెంట్ అయింది. ఆదివారం(నవంబర్ 28) బైక్‌పై వెళ్తుండగా అతడు అదుపు తప్పి కిందపడిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో షేన్ వార్న్ తనయుడు జాక్సన్ కూడా బైక్‌పై ఉన్నట్లు తెలిపాడు.
అయితే.. యాక్సిడెంట్లో స్వల్ప గాయాలైనట్లు షేన్ వార్న్ వెల్లడించాడు. చెకప్ కోసం ఆసుపత్రికి కూడా వెళ్లినట్లు స్పష్టం చేశాడు. అయితే.. డిసెంబర్ 8న గబ్బా వేదికగా జరగనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ తొలి టెస్టుకు కామెంట్రీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.
గొప్ప బౌలర్‌గా రాణించి..
ఆసీస్ మాజీ ఆటగాడు కెరీర్లో గొప్ప బౌలర్‌గా నిలిచాడు. 145 టెస్టులు, 194 వన్డేలకు ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు.