అఫ్గానిస్థాన్‌తో నవంబర్‌లో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ను(Aus vs AFG test 2021) వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia News) ప్రకటించింది. తాలిబన్ ప్రభుత్వం మహిళలను క్రికెట్ ఆడనివ్వదనే అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉన్నతాధికారులతో చర్చలు జరిపాకే పురుషుల జట్టుతో ఆడాల్సిన టెస్టు మ్యాచ్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
తాలిబన్లు మహిళా క్రికెట్‌పై నిషేధం విధిస్తే.. ఆ దేశ పురుషుల జట్టుతో ఆడాల్సిన టెస్టు పూర్తిగా రద్దవుతుందని ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
అఫ్గాన్ జట్లతో సహా.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల, మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోందని తమ ప్రకటనలో పేర్కొంది. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న మహిళల ప్రపంచకప్‌లో అఫ్గాన్ మహిళా జట్టు ప్రాతినిథ్యం వహించకపోతే పురుషుల జట్టును కూడా అంతర్జాతీయంగా బ్యాన్ చేయనున్నట్లు తొలుత కొన్ని దేశాలు హెచ్చరించాయి.