ఒమన్, యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ (T20 world Cup) కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. ప్రస్తుతం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల్లో పాల్గొనని స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, పాటన్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. వీరితో పాటు యువ కీపర్ జోష్ ఇంగ్లిష్‌కు పిలుపు అందింది. ప్రధాన వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు ప్రత్యామ్నాయంగా ఇతడిని తీసుకున్నారు.
మోకాలు సర్జరీ కారణంగా బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరంగా ఉన్న ఫించ్ ప్రపంచకప్ వరకు కోలుకుంటాడని యాజమాన్యం భావిస్తోంది. అలాగే స్మిత్ కూడా మోచేతి గాయం నుంచి బయటపడతాడని ఆశిస్తోంది.
కీపర్ అలెక్స్ కారే, ఆల్‌రౌండర్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జోష్ ఫిలిప్, ఆష్టన్ టర్నర్‌లు చోటు దక్కించుకోలేకపోయారు. స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్‌లను కూడా జట్టులోకి తీసుకుంది యాజమాన్యం..
ఇప్పటివరకు ఐదు వన్డే ప్రపంచకప్ టైటిళ్లతో రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియా. కానీ టీ20 వరల్డ్‌కప్ మాత్రం గెలవలేకపోయింది. ఇటీవల బంగ్లాదేశ్, వెస్డిండీస్లతో జరిగిన టీ20 సిరీస్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో త్వరలో ప్రారంభంకాబోయే ప్రపంచకప్‌లో పటిష్ట జట్టుతో బరిలో దిగాలవి భావిస్తోంది.
టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), ఆష్టన్ అగార్, జోష్ హెజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, స్టోయినిస్, మైఖెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా