Smith stuck in Lift: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఆడుతున్న ఇతడు టీమ్ హోటల్లోని ఓ లిఫ్టులో ఇరుక్కున్నాడు. దాదాపు గంటసేపు లిఫ్టు పనిచేయకపోవడం వల్ల అందులోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు స్మిత్.
లిఫ్టులో ఇరుక్కున్న స్మిత్.. గంటసేపు అందులోనే! - యాషెస్ 2021 స్మిత్
Smith stuck in Lift: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. దాదాపు గంటసేపు లిఫ్టు పనిచేయకపోవడం వల్ల అందులోనే ఉండిపోయాడు.
Steve Smith
ఏం జరిగిందంటే?
మెల్బోర్న్ పార్క్ హయాత్ హోటల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పని మీద లిఫ్టు ఉపయోగించుకున్న క్రమంలో అది కాస్తా పనిచేయకుండా పోయింది. దీంతో 55 నిమిషాల పాటు లిఫ్టులోనే ఇరుక్కుపోయాడు స్మిత్. ఈ సమయంలో లబుషేన్ డోర్ల గ్యాప్ లోంచి అతడికి జెమ్స్ ఇచ్చాడు. ఇవి తింటూ, ఫోన్‌తో కాలక్షేపం చేశాడు స్మిత్. టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేశాక అతడు బయటకు వచ్చాడు.