Nathan Lyon Ashes 2023 : లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒక టెస్ట్‌లో గెలిచి ఊపు మీద ఉన్న ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌తో మరో హోరా హోరీ సమారానికి సిద్ధం కానుంది. ఈ క్రమంలో ఆసీస్ జట్టు స్పిన్ బౌలర్ నాథన్ లైయన్.. ఈ వేదికపై ఓ అరుదైన రికార్డును సృష్టించనున్నాడు. బుధవారం జరిగే మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున వరుసగా 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బౌలర్‌గా చరిత్రకెక్కనున్నాడు. ఈ 35 ఏళ్ల స్టార్ ప్లేయర్.. తన సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో దాదాపు 99 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో ఈ ఘనతను అందుకోనున్నాడు.
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు సై.. ఆ రెండు రికార్డుల కోసం నాథన్ ట్రై ! - నాథన్ లైయన్ రికార్డు
Ashes 2023 : హోరా హోరీగా జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ రెండో దశకు చేరుకుంది. లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా గురువారం ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ లైయన్ రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించనున్నాడు. అవేంటంటే ?
Nathan Lyon Test Records : మరోవైపు నాథన్ లైయన్ కంటే ముందే ఈ రికార్డు మరో ఐదుగురు క్రికెటర్ల పేరిట ఉంది. అయితే వీరందరూ 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడినవారే. అలెస్టర్ కుక్ (159 మ్యాచ్‌లు), అలన్ బోర్డర్ (153 మ్యాచ్‌లు), మార్క్ వా (107 మ్యాచ్‌లు), సునీల్ గావస్కర్ (106 మ్యాచ్‌లు), బ్రెండన్ మెకల్లమ్ (101 మ్యాచ్‌లు)లతో ముందంజలో ఉన్నారు. అంతే కాకుండా ఇదే వేదికలో మరో అరుదైన రికార్డును తన పేరిట రాసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో 500 వికెట్ల ఫీట్ సాధించేందుకు కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్నానని తెలిపిన నాథన్.. లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించేందుకు ప్రయత్నిస్తానంటూ ఇటీవలే చెప్పుకొచ్చాడు.
Ashes 2023 England Team : ఇక మ్యాచ్ విషయానికి వస్తే..గురువారం జరగనున్న యాషెస్ రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్.. తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో గాయపడిన మోయిన్ అలీ ఇంకా కోలుకోనందున అతడి స్థానంలో 25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో యాషెస్ రెండో టెస్ట్ ఆడే ఇంగ్లండ్ తుది జట్టులో బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలీ, జోరూట్, ఓలీ పోప్, బెన్ డక్కెట్, హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జేమ్స్ అండర్సన్‌లు ఉన్నారు.