అస్వస్థతకు గురైన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ రికీ పాంటింగ్ తిరిగి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. శనివారం ఉదయం తిరిగి ఎంతో ఉత్సాహంగా కామెంట్రీ విధుల్లోకి వచ్చానని పాంటింగ్ స్వయంగా తెలిపాడు. "బహుశా నేను నిన్న చాలా మందిని భయపెట్టి ఉంటాను. నిజం చెప్పాలంటే.. నాకు కూడా అది భయంకరమైన క్షణమే. అయితే, ఈ ఉదయం నాకెంతో గొప్పది. షైనీ అండ్ న్యూ" అంటూ పాంటింగ్ కామెంట్రీ ప్రారంభించినట్లు ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఈ వార్తతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రికీ పాంటింగ్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడెలా ఉన్నాడంటే? - కోలుకున్న రికా పాంటింగ్
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ రికీ పాంటింగ్ హెల్త్ అప్డేట్ గురించి తెలిసింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
![రికీ పాంటింగ్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడెలా ఉన్నాడంటే? Ricky ponting health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17101957-thumbnail-3x2-rickyy.jpg)
కోలుకున్న రికా పాంటింగ్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు ఛానెల్ 7 తరఫున పాంటింగ్ కామెంటటేర్‌గా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు 40 నిమిషాల పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించిన 47 ఏళ్ల పాంటింగ్.. ఛాతిలో నొప్పి కారణంగా కామెంట్రీ బాక్స్ నుంచి వేగంగా బయటకు వచ్చాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు కోలుకోవడంతో తిరిగి కామెంట్రీ విధుల్లో చేరాడు.
ఇదీ చూడండి:దీపక్ చాహర్‌కు చేదు అనుభవం.. ఆ ఎయిర్ లైన్స్‌పై ఆగ్రహం!