తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్లియర్ బౌల్డ్ అయినా ఔట్ కాలేదు.. వైరల్ వీడియో..!

Australia Cricket News: ఆస్ట్రేలియాలోని మహిళల దేశవాళీ క్రికెట్‌లో ఓ వింత ఘటన జరిగింది. ఒక బ్యాటర్‌ క్రీజులో బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి వికెట్లకు తాకి బెయిల్స్‌ కిందపడ్డాయి. అయినా, దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆ బ్యాటర్‌ ఔటవ్వకుండా బతికిపోయింది.

Australia Cricket News
ఆస్ట్రేలియా క్రికెట్​

By

Published : Dec 21, 2021, 5:31 AM IST

Australia Cricket News: క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆస్ట్రేలియాలోని మహిళల దేశవాళీ క్రికెట్‌లో అటువంటి ఘటనే జరిగింది. ఒక బ్యాటర్‌ క్రీజులో బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి వికెట్లకు తాకి బెయిల్స్‌ కిందపడ్డాయి. అయినా, దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆ బ్యాటర్‌ ఔటవ్వకుండా బతికిపోయింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, టాస్మానియా జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా క్వీన్స్‌లాండ్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ 26 పరుగుల వద్ద .. సారా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయింది. బంతి బ్యాట్‌ను దాటుకుంటూ వెళ్లి ఆఫ్‌స్టంప్‌పైనున్న బెయిల్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అవి కిందపడ్డాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అయినా అక్కడే ఉన్న కీపర్‌ ఈ విషయాన్ని గుర్తించలేదు.. మరోవైపు బౌలర్‌ అప్పీల్‌ చేయలేదు. దీంతో అంపైర్లు కూడా పట్టించుకోలేదు.

Cricket Viral Vedio News:

కీపర్ గ్లోవ్స్‌ తాకి బెయిల్స్‌ పడి ఉండొచ్చని అంతా భ్రమించారు. దీంతో బ్యాటర్‌ కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయింది. అయితే, రీప్లేలో ఆ బంతి బెయిల్స్‌ అంచులు తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా, అప్పటికే బ్యాటర్‌ బతికిపోయింది. చివరికి 31 పరుగుల వద్ద జార్జియా ఔటైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వీన్స్‌లాండ్‌ 48 ఓవర్లకు (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) 223/6 స్కోర్‌ చేసింది. అనంతరం టాస్మానియా 232 పరుగులు చేసి విజయం సాధించింది.

ఇదీ చదవండి:పాక్ స్టార్ క్రికెటర్​పై రేప్ కేసు!

ABOUT THE AUTHOR

...view details