Australia Cricket Coach: టెస్టులు, వన్డేలు, టీ20 జట్లకు వేర్వేరుగా కోచ్‌ల నియామకం.. కొత్త ప్రయోగానికి ఆస్ట్రేలియా క్రికెట్ సన్నాహాలు చేస్తోందా...? ఇప్పుడిదే అక్కడి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్. వీటికి బలం చేకూరేలా క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హాక్లే ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. వేర్వేరు ఫార్మాట్లకు కోచ్‌లను విభజించవచ్చని సూచించాడు. అలానే ప్రస్తుతమున్న ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగుతాడా? లేదా అనేదానికి మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రధాన కోచ్‌గా జస్టిన్ లాంగర్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు ఉంది. ఈ క్రమంలో లాంగర్‌ను టెస్టులకే పరిమితం చేసి వన్డేలు, టీ20 జట్లకు మైకెల్ డివెంటో, ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
క్రికెట్లో కొత్త ప్రయోగం.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు! - ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిక్ హాక్లే
Australia Cricket Coach: ఆస్ట్రేలియా క్రికెట్లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్‌లను నియమించేందుకు అక్కడి బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బోర్డు చీఫ్ నిక్ హాక్లే చెప్పిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆయన ఏం అన్నారంటే?
లాంగర్ తన పదవీకాలం ముగిసేవరకు (వచ్చే ఏడాది జూన్) వరకు ప్రధాన కోచ్‌గా ఉండాడని నిక్ హాక్లే తెలిపారు. "వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై ఇప్పుడే ఆలోచించట్లేదు. అయితే ప్రస్తుత క్రీడా సీజన్ ముగిసేలోపు చర్చిస్తాం. అలానే జస్టిన్ లాంగర్ కాంట్రాక్ట్ ముగిసేవరకూ అతడే ప్రధాన కోచ్. అందులో మరో ప్రశ్నకు తావులేదు. యాషెస్ సిరీస్ ముగిశాక.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై మాట్లాడుకుంటాం" అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్-మయాంక్ రికార్డు