Australia Coach Cameron Green: భారత టీ20 లీగ్‌లోకి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అరంగేట్రంపై ఆసీస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొంటే దాదాపు 12 నెలలపాటు సరైన విరామం లేక విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ ముంగిట తన ప్రదర్శనపై ఇది ప్రభావం చూపుతుందని డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ భావిస్తున్నారు. అయితే ఈ యువ ఆటగాడు మాత్రం అన్ని ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఆసక్తి చూపుతున్నాడు. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు.
'భారత టీ20 లీగ్‌పై గ్రీన్ ఇప్పుడే ఓ నిర్ణయానికి రాడు' - ఆండ్రూ మెక్‌డొనాల్డ్ గ్రీన్ కోసం ఆందోళన
భారత టీ20 లీగ్‌లోకి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అరంగేట్రంపై జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కామెరూన్ గ్రీన్
రానున్న మూడు నెలల్లో ఏదైనా జరగవచ్చని.. గ్రీన్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చునని అన్నాడు. "మార్చి నెలాఖరులోగా గ్రీన్ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఈ మూడు నెలల కాలంలోనే అతడు చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కచ్చితంగా భారత టీ20 లీగ్‌పై అతడు ఇప్పుడే ఓ నిర్ణయానికి రాడు. శరీరం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేం. రానున్న కొద్ది రోజుల్లో 9 టెస్టులు, ఒక వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్ గ్రీన్ ఆడాల్సివుంది" అంటూ ఆండ్రూ తెలిపాడు.
TAGGED:
andrew comment on greens