ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత మహిళా జట్టు(team india news) ఓడిపోయింది. మన టీమ్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని.. అతిథ్య ఆసీస్ 19.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, ఇందులో గెలిచిన ఆస్ట్రేలియా.. 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.
IND VS AUS: ఆసీస్ చేతిలో టీమ్ఇండియా ఓటమి - ipl latest news
వర్షం కారణంగా తొలి టీ20 రద్దవగా, శనివారం టీమ్ఇండియా(team india news) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఈ పోరులో(cricket live) తహిలా మెక్‌గ్రాత్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
తొలుత టాస్ ఓడిన టీమ్ఇండియా(team india news) బ్యాటింగ్‌కు దిగింది. మన బ్యాట్స్ఉమెన్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(28), పూజా వస్త్రకర్(37), దీప్తి శర్మ(16) మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో వ్లామినిక్, మోలినిక్స్ తలో 2 వికెట్లు తీయగా, గార్డ్నెర్, వార్హెమ్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ తీశారు.
ఛేదనలో తడబడుతూ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టులో మూనీ(34), హేలీ(4), మెగ్ లానింగ్(15), గార్డ్నెర్ (1), పెర్రీ (2), మెక్‌గ్రాత్ (42), క్యారీ (7), వార్హెమ్ (10) తమ వంతు పాత్ర పోషించారు. భారత(team india news) బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీయగా.. శిఖా పాండే, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.